కారేపల్లి, మహా: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గంగారం తండాలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమల రావు గురువారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి–సమృద్ధులతో జీవించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నూకల మోహన్ రావు, భూక్య నాగేశ్వరరావు, నందులాల్, అజ్మీరా చిట్టిబాబు, వస్తాం, శ్రీకాంత్, వంశీకుమార్, అజయ్, సాయికిరణ్, మంగీలాల్, భావసింగ్, సందీప్, ప్రవీణ్, శ్రీధర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.








