Mahaa Daily Exclusive

  వెంకటసాయినగర్ గణేష్ మండపం వద్ద కోలాహాలం … ఆటపాటలతో సందడి….

Share

కారేపల్లి మహా:కారేపల్లి వెంకటసాయినగర్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద నిర్వహకులు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలతో కోలహలం నెలకొంది. పూజ కార్యక్రమాలతో పాటు పాటలు,నృత్య పోటీలు, మహిళలకు ప్రత్యేకంగా కూర్చీ ఆట, బెలూన్స్ పేల్చటం, దారం లాగటం వంటి ఆటలతో ఉత్సహపరుస్తున్నారు. శుక్రవారం మహిళల చేత కుంకుమ పూజలు నిర్వహించి అల్పహారం ఏర్పాటు చేశారు. కారేపల్లి యాదవ బజార్ ఏర్పాటు చేసిన మండపం వద్ద చిన్నారులు చేస్తున్న కోలాటం ఆకట్టుకుంటుంది. సాయంత్రం కాగానే మండపాలవద్ద యువత సందడి చేస్తూ అలరిస్తున్నారు.