Mahaa Daily Exclusive

  అర్హత కలిగిన ఓటర్ల పేర్లు ఓటరు జాబితాలో ఖచ్చితంగా నమోదు చేయాలి..

Share

 

వరంగల్, మహా ;

ఎస్‌ఐఆర్‌–2026లో భాగంగా జిల్లాలో నిర్వహిస్తున్న
స్పెషల్ ఇంటెన్సివ్ కాంపెయిన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శనివారం పరిశీలించారు.
స్పెషల్ ఇంటెన్సివ్ కాంపెయిన్‌లో భాగంగా శనివారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న స్పెషల్ క్యాంపెయిన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, ఓటర్ల నుంచి ఫామ్ 6,7,8 దరఖాస్తుల ప్రక్రియ ఎస్ ఐ ఆర్ లో భాగంగా నోటీస్ డిస్ట్రిబ్యూషన్ విధానం, సంబంధిత పత్రాల పరిశీలన, రికార్డుల నమోదు తదితర అంశాలను పరిశీలించారు.

కొత్తవాడ ఆటోనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు శివనగర్‌లోని ప్రభుత్వ పాఠశాల తో పాటు మామునూర్ లోని 166, 167,168 పోలింగ్ స్టేషన్లలో స్పెషల్ క్యాంపెయిన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.

ఆయా కేంద్రాల్లో హాజరైన ఓటర్ల వివరాలు, వారి నుంచి స్వీకరిస్తున్న అభ్యంతరాలు, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌–2026 ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుంచి వచ్చే ప్రతి అభ్యంతరం, దరఖాస్తును నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ఓటర్ల పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు, అనర్హమైన లేదా తప్పుగా నమోదైన వివరాల పై వచ్చే అభ్యంతరాలను కూడా నిర్దేశిత ఫాం 6,7,8 లలో నమోదు చేయాలని సూచించారు.
ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ప్రక్రియపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని అధికారులకు సూచించారు.

ఎస్‌ఐఆర్‌
ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని తెలిపారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ పరిశీలనలో వరంగల్ ఆర్డీవో సుమ, వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్, ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, ఆర్డీవో కార్యాలయం డిఏఓ ఫణికుమార్ సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.