Mahaa Daily Exclusive

  ఆదిలాబాద్ జిల్లా యువతి అరుదైన ఘనత మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 గా ప్రీతి ముండే

Share

ఆదిలాబాద్, మహా

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువతి అరుదైన ఘనత సాధించింది. ఇంద్రవెల్లి మండలంలో ‌ హీరపూర్ యువతి ప్రీతి ముండే మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. రాజస్థాన్ లోని జైపూర్ లో ‌జరిగిన పోటీలలో ‌మిస్ ఎర్త్ వాటర్ ఇండియా కీరీటం దక్కించుకున్నారు. ఒక సాధారణ పల్లెటూరి నుంచి వచ్చిన ప్రీతి ఈ ఘనత సాధించడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి హైదరాబాద్‌కు వచ్చి పాఠశాల విద్యార్థులకు యోగా టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ పోటీల్లో మిస్ కంజీనియాలిటీ 2026 టైటిల్‌ను కూడా ఆమె సొంతం చేసుకోవడం విశేషం. యోగా ట్రైనర్ గా ప్రయాణం ప్రారంభించి, జాతీయ స్థాయి అందాల పోటీల వరకు ఎదిగి ఈ ప్రతిష్టాత్మక కిరీటాన్ని దక్కించుకున్నారు. యవతికి అరుదైన పురస్కారం‌ రావడంపై గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు.