Mahaa Daily Exclusive

  కూతురి పెళ్లిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే ఖర్మ నాకు లేదు: జగన్‌ను కలవడంపై వస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన వైఎస్ షర్మిల!

Share

నేను ఎవరినో కలిసినట్లు, ఎక్కడో చేరిపోతున్నట్లు, నా మీద సోషల్ మీడియాలో అల్లుతున్నవి కట్టుకథలు. చేస్తున్న విశ్లేషణలు పూర్తిగా నిరాధారం. జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం. గిట్టని వాళ్ళవి పస లేని ఆరోపణలు. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా.

వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని నేను చివరిసారిగా కలిసింది నా కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సమయంలోనే. మళ్లీ ఇప్పుడు కలిసినా.. నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి మాత్రమే.

అన్ని రాజకీయ పార్టీల అధినేతలను నా బిడ్డ పెళ్లికి రావాలని, దీవించాలని ఆహ్వానిస్తాను. ఇందులో కొత్తేం లేదు .. వింత అంతకన్నా కాదు. కన్న కూతురు వివాహాన్ని అడ్డుపెట్టుకొని తెర వెనుక రాజకీయాలు చేసుకొనే ఖర్మ YSR బిడ్డగా నాకు లేదు.

శుభకార్యానికి, రాజకీయానికి లింకులు పెట్టి, నా విశ్వసనీయతను, రాజకీయ ప్రామాణికతను, ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదు.

నా బిడ్డ వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డి వివాహ మహోత్సవానికి తెలుగు ప్రజలందరూ.. ఒక్కటి కాబోతున్న నవదంపతులకు హృదయ పూర్వక ఆశీస్సులు అందించాలని కోరుతున్నా.