- ఆత్మహత్యలకు కేరాఫ్ గా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్
- డీజిల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నం
- భార్యాభర్తల పంచాయతీ పై ఇరువర్గాల పిటిషన్
- మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ లో ఇది రెండో ఘటన
వరంగల్, క్రైం మహా;
వరంగల్ సబ్ డివిజన్ లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు ఆత్మహత్యలతో కూడిన అగ్నిగండం పొంచి వున్నట్లుగా ఉందో ఏమో అని స్థానికులు చెబుతున్నారు.
భార్యాభర్తల పంచాయతీలో భాగంగా ఇరువర్గాలు పిటిషన్ ఇవ్వగా ఆ వ్యక్తి స్టేషన్ ఆవరణ లోనే డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇటీవల కాలంలో
మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ లో ఇది రెండో ఘటన.
వివరాల్లోకెళ్తే..
వరంగల్ ఉర్సు ప్రాంతానికి చెందిన భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదం పై ఇరువర్గాలు మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ లో పిటిషన్లు ఇచ్చారు. ఈ క్రమంలో అనూప్ అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్ ఎదుట ఒంటి పై డీజిల్ పోసుకోవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. స్పందించిన పోలీసులు నీళ్లు పోసి ప్రమాదాన్ని నివారించి, అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
భార్యాభర్తల మధ్య సమస్య పై ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్‌స్టేషన్ వద్ద ఇలాంటి చర్యలకు పాల్పడటం మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న రెండో ఘటనగా పోలీసులు పేర్కొంటున్నారు.
*సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలి*
ఏవైనా సమస్యలు ఉంటే పోలీస్‌స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని వాటిని చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని తెలిపారు. సమస్యలు రాగానే ఆత్మహత్యకు పాల్పడడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యల ద్వారా న్యాయం పొందలేరని పోలీసులు సూచించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు కూడా తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న కొత్త చట్టాల ప్రకారం ప్రతి ఒక్కరూ బాధ్యతా యుతంగా వ్యవహరించాలని మిల్స్ కాలనీ పోలీసులు తెలిపారు. ముఖ్యంగా
ప్రజల ఆలోచనా విధానం మారాలని ఇందుకు చట్టాల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.








