Mahaa Daily Exclusive

  గణనాధులను దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకులు డా. పల్లె గోపాల్ గౌడ్….

Share

  • గణనాధులను దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకులు డా. పల్లె గోపాల్ గౌడ్..
  • మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 20 మహా:
పట్నంలో గణనాధులను దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకులు డా. పల్లె గోపాల్ గౌడ్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, ఆదిభట్ల సర్కిల్ కొంగరకలాన్ డివిజన్ లోని, చింతపల్లిగూడ గ్రామంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయకుని, బీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ పల్లె గోపాల్ గౌడ్, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనిద్దరం ఉన్న విత్తరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులు నిర్వాహకులతో కలిసి సాఫంతి భోజనం చేశారు. కొంగరకలాన్ గ్రామంలోని ద్వారకా నగర్ కాలనీలో శ్రీ లక్ష్మీనరసింహ యూత్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన, గణనాథుడి మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం కేంద్రంలోని స్కై బ్లూ గణనాథుని, నోముల గ్రామంలోని ఎర్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గజానాధుని దర్శించుకున్నారు. నిర్వాహకులు ఆయనకు శాలువాతో సన్మానించి మేమేంటోను అందించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఎల్లప్పుడు సుభిక్షంగా రాష్ట్ర ప్రజలు ఉండాలని ఆ యొక్క గజనాధుని కోరినట్లు గోపాల్ గౌడ్ తెలిపారు.