గోవిందరావు పేట, మహా ;
ములుగు జిల్లా గోవిందరావుపేట తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తండ్రీ కుమారుడి మధ్య భూ వివాదం పరిష్కారం కోసం తహశీల్దార్ సృజన్ రూ.14 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. దీంతో తనిఖీలు నిర్వహించి సృజన్‌ను పట్టుకున్న అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.








