- తెలుగు ఇండస్ట్రీలో మరో ప్రామిసింగ్ స్టార్ శ్రీనాథ్ మాగంటి
- హిట్, యానిమల్, లక్కీ భాస్కర్ లతో లక్కీ యాక్టర్ గా గుర్తింపు
- ఈఎన్ఈ-2 కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందన్న అంచనా
మహా
తెలుగు ఇండస్ట్రీలో.. మరో ప్రామిసింగ్ హీరోగా శ్రీనాథ్ మాగంటి నిలదొక్కుకుంటారు. హిట్, యానిమల్, లక్కీ భాస్కర్ వంటి సూపర్ హిట్ మూవీస్ లలో నటించి.. తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న శ్రీనాథ్ త్వరలో వచ్చే ఈనగరానికి ఏమైంది-2లో విశ్వక్ సేన్ తో కలిసి లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమా శ్రీనాథ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందన్న అంచనాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇటు తెలుగులోనే కాకుండా పౌత్, నార్త్ ఏ ఇండస్ట్రీ అయినా ఓన్ చేసుకునే టాలెంట్, అప్పీయరెన్స్ శ్రీనాథ్ సొంతం. ‘హిట్, యానిమల్, లక్కీభాస్కర్’ వంటి హిట్ చిత్రాల్లో నటించగా, కొందరు ప్రేక్షకులు నన్ను పరభాషా నటుణ్ణి అనుకుంటున్నారు. కానీ నేను పక్కా తెలుగు యాక్టర్ని. ఈ సినిమాతోనైనా తెలుగు ప్రేక్షకులు నా పేరు గుర్తు పెట్టుకుంటారని ఆశిస్తున్నానని శ్రీనాథ్ వినమ్రంగా చెబుతాడు. ప్రేక్షకుల గుండెల్లో కొంతకాలం పాటు గుర్తుండిపోయే పాత్రల్లో నటించాలని శ్రీనాథ్ కోరిక. అది ఈఎన్ఈ2తో తీరనుండగా, ఇంకా క్రేజీ ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. సెన్సేషన్ క్రియేట్ చేయగా శ్రీనాథ్ లక్కీ యాక్టర్ గా మారారు. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘ఈ నగరానికి ఏమైంది 2’ లో ఒక హీరోగా నటిస్తున్న శ్రీనాథ్ కెరీర్ కు ఇది బూస్ట్ అవుతుందని ఇండస్ట్రీ టాక్.








