- టీచర్ మందలింపుతో ఆరేళ్ల విద్యార్థి మృతి
- జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఘటన
విశాఖపట్టణం, మహా : పాఠశాలలో టీచర్ మందలించడంతో ఆరేళ్ల విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటు చేసుకుంది. విశాఖ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థి రోజు మాదిరిగానే పాఠశాలకు వెళ్లాడు. హోంవర్క్ చేయకపోవడంతో విద్యార్థి వినయ్ తేజ్ ను టీచర్ మందలించింది. ఇది జరిగిన కొద్దిసేపటికే విద్యార్థి గుక్కపెట్టి ఏడుస్తూ కుప్పకూలి పోయాడు. టీచర్ ఒడిలోనే పడిపోగా వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే విద్యార్థి వినయ్ తేజ్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు హుటాహుటిన స్కూలుకు వెళ్లారు. బోరున విలపించారు. టీచర్ కొట్టడం వల్లనే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపించారు. పాఠశాల వద్ద ఆందోళన చేశారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దాంతో పోలీసులు టీచర్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 8








