Mahaa Daily Exclusive

  ఎస్‌ఐఆర్‌ లో 39 855 హియరింగ్స్ పూర్తి…

Share

  • ఎస్‌ఐఆర్‌ లో 39 855 హియరింగ్స్ పూర్తి
  • వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్, కలెక్టరేట్ మహా;

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు 194 395 నోటీసులు జారీ చేయగా, 39,855 హియరింగ్స్‌ నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.

103 నర్సంపేట 13,460,
106 వరంగల్ తూర్పు 10,236, 107 వర్ధన్నపేట 15,495 నియోజగా వర్గాల వారిగా హియరింగ్స్‌ నిర్వహించినట్లు వెల్లడించారు.
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా అందిన నోటీసుల పై హియరింగ్స్‌ ను నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేసి, తదుపరి ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తూ, అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.