వరంగల్,నల్లబెల్లి మహా ;
వరంగల్ జిల్లా లోని నల్లబెల్లి మండలం అర్షనపల్లి గ్రామంలో భూభారతి రీ-సర్వేపై నిర్వహించిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూభారతి రీ-సర్వే ప్రక్రియ, భూ వివరాల నమోదు, సర్వే సమయంలో భూ యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రీ-సర్వే ద్వారా కలిగే ప్రయోజనాల పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
రీ-సర్వే ప్రక్రియలో గ్రామస్థులు సహకరించాలని, తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు.
భూ వివరాల్లో ఏవైనా తేడాలు, అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
ఈ గ్రామ సభ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, ఏడి సర్వే, రికార్డ్స్ అధికారి శ్రీనివాసులు, నల్లబెల్లి తహసిల్దార్ కృష్ణా ,ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.








