Mahaa Daily Exclusive

  ప్రజల సహకారంతోనే స్వచ్ఛా పంచాయతీ…

Share

  • ప్రజల సహకారంతోనే స్వచ్ఛా పంచాయతీ
  • రావోజీతండా విద్యార్ధులకు వ్యాసరచనపోటీలు

కారేపల్లి మహా :ప్రజల సహకారంతోనే స్వచ్ఛాపంచాయతీ సాధ్యమని రావోజీతండా సర్పంచ్ భూక్య బాలు అన్నారు. శుక్రవారం స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీలో పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తడి, పొడి చెత్త, హానికరమైన చెత్త, సానిటరీవ్యర్ధాలు వంటి నాలుగు రకాలుగా విభజించి సేకరించటంపై గ్రామస్తులకు సర్పంచ్ బాలు వివరించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం ద్వారా దోమలు వ్యాప్తి నిరోధించటం, వ్యాధుల భారిన పడకుండా ఉండవచ్చని తెలిపారు. ఈసందర్భంగా విద్యార్ధులకు స్వచ్ఛత పై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.