Mahaa Daily Exclusive

  పెరియార్ సామాజిక సంస్కరణలు మరువలేనివి…

Share

  • పెరియార్ సామాజిక సంస్కరణలు మరువలేనివి
  • డిబిఎస్ఏ జిల్లా అధ్యక్షులు కంబాలపల్లి మహేష్
    ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 17 మహా:
సామాజిక అసమానతలు, కుల వివక్ష, మూఢనమ్మకాలపై జీవితాంతం పోరాడిన మహనీయుడు ఈ.వీ. రామస్వామి పెరియార్ అని డిబిఎస్ఏ జిల్లా అధ్యక్షులు కంబాలపల్లి మహేష్ అన్నారు. 147వ పెరియార్ జయంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పెరియార్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ… సమాజంలో వెనుకబడిన వర్గాలకు ఆత్మగౌరవం, సమానత్వం, విద్య, సామాజిక న్యాయం అందాలనే లక్ష్యంతో పెరియార్ చేసిన కృషి చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని అన్నారు. సామాజిక వివక్షకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాల హక్కుల కోసం విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. వంగాల విష్ణువర్ధన్, డీబీఎస్ఏ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ… మహనీయుల చరిత్రను వాస్తవ ఆధారాలతోనే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత రచయితలు, మేధావులు, సామాజిక వర్గాలపై ఉందన్నారు. పెరియార్ వంటి సామాజిక సంస్కర్తల ఆలోచనలను యువత అధ్యయనం చేసి సమానత్వం, సామాజిక విలువలను కాపాడేందుకు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వినోద్. శ్రీకాంత్. ప్రణీత్ రాజ్. భూపతి. భరత్. నాయకులు, కార్యకర్తలు పాల్గొని పెరియార్‌కు నివాళులు అర్పించారు.