- గణేష్ మండపాల వద్ద భద్రత చర్యలు చేపట్టాలి
- మండపాల నిర్వాహకులకు అవగాహన కల్పించిన సీఐ సాగర్
కారేపల్లి, మహ:
గణేష్ మండపాలను ఏర్పాటు చేసే వారు తప్పని సరిగా మండపాలవద్ద ముందస్తు భద్రత చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఐ ఎన్.సాగర్,ఎస్సై బైరు గోపీ లు కోరారు. బుధవారం కారేపల్లిలోని సింగరేణి సర్కిల్ కార్యాలయంలో గణేష్ ఉత్సవ కమిటీల సభ్యలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ, ఎస్సై లు మాట్లాడుతూ మండపాల వద్ద కమిటీ సభ్యులు నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. భక్తి కార్యక్రమాన్ని కలుషితం చేయకుండా ప్రశాంత వాతావరణలో నవరాత్రులు నిర్వహించాలని కోరారు. విద్యుత్ షాట్ సర్క్యూట్లు పట్ల, అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్త అవసరమన్నారు.మండపాల స్ధలాలు, నిమర్జన తేదిలు కమిటీ సభ్యుల పేర్లు, ఫోను నెంబర్లు పోలీసులకు అందజేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలన్నారు








