*ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి*
*హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి*
హనుమకొండ, మహా ;
జిల్లాలో రానున్న వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ముందుస్తుగానే సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి అన్నారు.
మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో పౌరసరఫరాలు, డిఆర్డిఏ, వ్యవసాయ, మార్కెటింగ్, తూనికలు కొలతల శాఖ అధికారులతో కలిసి ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, పిఎసిఎస్ ల సీఈవోలు, ఏపీఎంలతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అవసరమైన మౌలిక వసతులు, పరికరాలను సెప్టెంబర్ 25లోగా పూర్తిస్థాయిలో సమకూర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా టార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు , తేమ కొలిచే మీటర్లు, తదితర పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సన్నరకం ధాన్యం రకాలను గుర్తించి, వాటి కొనుగోలుపై సంబంధిత సిబ్బందికి స్పష్టమైన అవగాహన కల్పించాలని అన్నారు.
జీపీఎస్ అమర్చిన వాహనాల ద్వారానే కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులు లేదా నిర్దేశిత గోడౌన్లకు తరలించాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు దాన్యాన్ని సెంటర్ లోనే కొనేవిధంగా పర్యవేక్షించాలని, వాహనాల కదలికలను జిపిఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, సీఈవోలు, ఏపీఎంలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు
ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి మహేందర్, డిఆర్డివో మేన శ్రీను, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, జిల్లా సహకార అధికారి మోహన్, జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి అనురాధ, జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు , పిఎసిఎస్ ల సీఈవోలు, ఏపీఎంలు, తదితరులు పాల్గొన్నారు.








