Mahaa Daily Exclusive

  వల్లభినేని గురవయ్య కుటుంబానికి మాజీ మంత్రి పువ్వాడ పరామర్శ

Share

కారేపల్లి, మహ: జిల్లా రవాణా శాఖ మాజీ సభ్యులు బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు వల్లభనేని రామారావు తండ్రి వల్లభనేని గురవయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ గురువారం విశ్వనాథపల్లిలోని గురవయ్య నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన భార్య తులిశమ్మ, కుమారులు వల్లభినేని రామారావు, వల్లభినేని చందర్ రావు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ మంత్రి వెంయ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, నాయకులు కూరాకుల వలరాజు, తాతా వెంకటేశ్వర్లు, సూరపురెడ్డి రవీంరదర్ రెడ్డి, వీరు నాయక్, లక్ష్మణ్ నాయక్, దేవభక్తిని కిషోర్, వెంకయ్య, శ్రీనివాసరావు, సురేష్, వీరేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు