Mahaa Daily Exclusive

  మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్! ప్రజానేతకు వినతుల వెల్లువ

Share

తాడేపల్లి, మహా

ప్రజల సమస్యలపై తక్షణం స్పందించే మనసున్న నేత రాంప్రసాద్ రెడ్డికి రాజధాని తాడేపల్లిలోనూ సందర్శకుల తాకిడి అధికంగా ఉంది.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి సమస్యలను, వినతులను స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిశీలించి, ప్రజలకు సత్వర పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మంత్రి స్పందన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
…….