Mahaa Daily Exclusive

  అమ్మపేరుతో ఒక మొక్క పాఠశాలలో ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమం

Share

 

కారేపల్లి, మహ : ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో శనివారం ఏక్ పెడ్ మాక్ నామ్ (అమ్మ పేరుతో ఒక మొక్క) కార్యక్రమాన్ని ప్రారంభించారు. కారేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల,ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో సర్పంచ్ మేదరి వీరప్రతాఫ్(టోనీ) ఎంపీడీవో బి. పద్మ, ఎంఈవో దుగ్గిరాల జయరాజు లు మొక్కలు నాటి విద్యారులతో నాటించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి అమ్మ పేరుతో ఒక్కొక్క మొక్క చొప్పున నాటాలని కోరారు. అమ్మపై ఉన్న ప్రేమతో విద్యార్థులు మొక్కలను నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ కుమారి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఎన్ఆర్ఈజీఎస్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.