- సర్కార్ దవాఖానా నిర్మాణ పనులు పర్యవేక్షించిన ఎమ్మెల్యే……
- ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిని మోడల్‌గా తీర్చిదిద్దుతాం..
- అందుకే ప్రతీదశ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నా…
- పెద్దచెరువును టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతా…
- నియోజకవర్గంలో ప్రతీ రోడ్డు బాగుకోసం దృష్టి..
- ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి…
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 19 మహా:
తాను వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఏ సంకల్పంతో నిర్మిస్తున్నానో… అదే సంకల్పంతో ఇబ్రహీంపట్నం సర్కార్ దవాఖానాను నిర్మాణం చేపడుతున్నట్లు, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. శనివారం ఇబ్రహీంపట్నంలో పర్యటించిన ఆయన… సర్కార్ దవాఖానా నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే… వీలైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా దిశానిర్దేశం చేశారు. తాత్కాలిక దవాఖానాలో సేవలు, మౌలికసదుపాయాలు, తదితర అంశాలపై వైద్యులతో చర్చించారు.
కార్పొరేట్ దవాఖాన తరహాలో….
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది ఆయన తెలిపారు. పేదలకు పైసా ఖర్చులేకుండా కార్పొరేట్ దవాఖాన తరహాలో వైద్యసేవలందించే దిశగా ఇబ్రహీంపట్నం సర్కార్ దవాఖాను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే పనుల పురోగతిని ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేస్తామన్న మల్‌రెడ్డి… దవాఖాన కావాల్సిన సౌకర్యాలను, వైద్యులను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
పర్యాటకకేంద్రంగా పెద్దచెరువు…
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దటంపై దృష్టిసారించినట్లు ఎమ్మెల్యే మల్‌రెడ్డి చెప్పారు. బోటింగ్, రెస్టారెంట్‌లాంటి వాటి ఏర్పాటుతో టూరిజం స్పాట్‌గా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
నిర్మాణంలో ఉన్న రోడ్లన్నీ పూర్తి చేస్తా…
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని ప్రతీ గల్లీతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల రోడ్ల బాగుకు దృష్టి సారించినట్లు మల్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికే సర్కార్ దృష్టికి తీసుకువెళ్లానని… నిర్మాణంలో ఉన్న రోడ్లన్నీ త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ భాస్కరాచారి ఇబ్రహీంపట్నం ఏసిపి కెపివి రాజు, సిఐ మహేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వై సుదర్శన్, ఆర్ అండ్ బి అధికారులు, సర్కార్ దవాఖాన సూపర్డెంట్, వైద్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు రామదాసు నాయక్, ఏఎంసి డైరెక్టర్లు దొంతరమోని రాజు, తాళ్ల మహేష్ గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు మహమ్మద్ గౌస్ పాషా, మండల అధ్యక్షులు రావణమోని లింగం, కొంగర డివిజన్ అధ్యక్షులు చెన్నమోని రమేష్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూపతిగళ్ల మహిపాల్, రాచర్ల వెంకటేశ్వర్లు, కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, తాళ్ల శ్రీశైలం గౌడ్, సిద్దంకి కృష్ణారెడ్డి మంకాల దాసు, వింజమూరి ప్రేమాకర్ రెడ్డి, ప్రశాంత్ రావు, మహిళ నాయకురాలు జయమ్మ, సత్య రాణి, కోడూరి రమేష్, వరికుప్పల సుధాకర్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.








