- డీప్ లెర్నింగ్ ఏఐ ట్రాన్స్‌ఫార్మర్స్ గ్నిటీసీలో శిక్షణ
- ఆరు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం పూర్తి
యూనివర్సిటీ చాన్సలర్ గగన్‌దీప్ సింగ్ కోహ్లీ
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 17 మహా: మున్సిపాలిటీ పరిధిలోని గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ (గ్నిటీసీ)లో ఏఐసిటిఈ – ఏటిఏఎల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్ డి పి) విజయవంతంగా ముగిసింది. “డీప్ లెర్నింగ్ ఫర్ రియల్-వరల్డ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఫండమెంటల్స్ టు డిప్లాయ్‌మెంట్” అంశంపై ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్, గురు నానక్ ఇన్‌స్టిట్యూషన్స్, గురు నానక్ యూనివర్సిటీ చాన్సలర్ గగన్‌దీప్ సింగ్ కోహ్లీ, మేనేజింగ్ డైరెక్టర్ వైస్ చాన్సలర్ డా. హెచ్. ఎస్. సైనీ హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. ఎస్. శ్రీనాథ రెడ్డి, డైరెక్టర్, డా. రిషి సయాల్; డా. ఎస్. వి. రంగనాయకులు, డీన్–ఆర్ అండ్ డి, డా. గీతా త్రిపాఠి, డా. మధు, డా. రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నిపుణులు ప్రొఫెసర్ సీనియర్ సైంటిస్ట్, ఎన్పిసిఐ ఎల్బిఎఆర్సి ముంబై, అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్ యూనివర్సిటీ డా. లలిత్ కుమార్ సింగ్, డా. సి. గణేష్ కుమార్, శ్రీనివాస్ తాలూకా, వైస్ ప్రెసిడెంట్–ఫెసిలిటీస్, టీ హబ్ హైదరాబాద్ సాంకేతిక సెషన్లు నిర్వహించారు. డీప్ లెర్నింగ్, ఏఐ, ట్రాన్స్‌ఫార్మర్స్, ఎల్ ఎస్ టి ఏం, మోడల్ డిప్లాయ్‌మెంట్ తదితర అంశాలపై శిక్షణ అందించారు. కార్యక్రమంలో భాగంగా టీ హబును సందర్శించారు. ఈ ఎఫ్ డి పి ద్వారా అధ్యాపకులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన మరియు పరిశ్రమ అవసరాలపై విలువైన అవగాహన లభించిందని నిర్వాహకులు తెలిపారు.








