కారేపల్లి, మహా: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రేగులగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమల రావు గురువారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
గ్రామ ప్రజలందరూ పాడి పంటలతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి–సమృద్ధులతో ఉండాలని, ప్రతి కుటుంబంపై విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నూకల మోహన్‌రావు, ఆవుల సత్యనారాయణ, నల్లగొర్ల వెంకటరమయ్య, పండగ వెంకటేశ్వర్లు, దొడ్డ అప్పారావు, లోయ శ్రీను, గంగుల నాగయ్య, పల్లెబోయిన సీత్తయ్య, ఆవుల వెంకయ్య, నల్లగొర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.








